యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు వెళ్లే భారతీయులు సులువుగా వీసా పొందచ్చు. ఇందుకోసం వీసా-ఆన్-అరైవల్‌ను యూఏఈ ప్రారంభించినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అర్హత కలిగిన భారతీయ పౌరులు 14 రోజుల వ్యవధితో కూడిన వీసాను యూఏఈ ఎయిర్‌పోర్టులోనే పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. అమెరికా జారీ చేసిన గ్రీన్ కార్డు, యురోపియన్ యూనియన్ దేశాలు, యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్, వీసాలు కలిగి ఉన్నవారు వీటిని పొందవచ్చు.