అరేబియా సముద్రంలోని అల్పపీడన ప్రాంతం నుంచి ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.