కంబదూరు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకు ఏరియాలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఏర్పాటు చేస్తే ఆందోళన చేపడుతామని మహిళలు హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఏరియాకు చెందిన మహిళలు, పురుషులు శనివారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ సీఐ మహమ్మద్ రఫీని కలిసి మద్యం షాప్ ఏర్పాటు చేయకూడదని వినపత్రాన్ని అందజేశారు.