పోలీసులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని, అందుకే మనమంతా ప్రశాంతంగా ఉన్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం అన్నారు.
ఆయన జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగిన పోలీస్ అమర వీరుల వారోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కార్య క్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.