ట్రూ ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలని ఆర్ ఎస్ పి జిల్లా కార్యదర్శి ఏ. శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెనుగొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డిఓ టి. ఆనంద్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఏ. శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ ఆఫ్ విధింపు విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తిప్పన్న, నరసింహులు, శ్రీరాములు గంగాధర్ పాల్గొన్నారు.