రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీలకు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టింది.
ఈ నేపథ్యంలో కాలేజీల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఐదు వైద్య కళాశాలల పేర్లను అధికారులు తొలగించారు. తాజాగా మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్చారు.