నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచరిస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలోని నాగులేటి రేంజ్ వద్ద ఈ పులి సంచరిస్తుంది. దీనిని అటవీ శాఖ సిబ్బంది వీడియోలో చిత్రీకరించింది. ఈ పులికి ఐదేళ్లు ఉంటాయని వారు తెలిపారు. గత వారం అటవీ శాఖ సిబ్బంది ఎప్పటిలాగా గస్తీ నిర్వహిస్తుంది. ఆ సమయంలో రహదారి పక్కనే ఉన్న పోదల్లో నుంచి పులి బయటకు వచ్చింది. కాసేపు పులి అక్కడే ఉండి.. అనంతరం మళ్లీ చెట్ల పోదల్లోకి వెళ్లిపోయింది. శివాలయం, వీఆర్ఎస్‌పీ ఆనకట్ట సమీపంలోని నాగులుటి రేంజ్ వరకు శాశ్వత నీటి వనరులు ఉన్నాయి. ఆయా ప్రాంతంలో జింకలు, మొసళ్లతో సహా వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అధికారి ఈ సందర్భంగా ధృవీకరించారు.
ఇది పులులకు ఆవాసమైన ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతం మూడు పులులకు నిలయంగా మారింది. అందులో చిన్న మగ, రెండు ఆడ పులులున్నాయని అటవీ శాఖ అధికారి వివరించారు.ఇటీవలి సంతానోత్పత్తి కాలం అనంతరం ఈ ప్రాంతంలో ఆడ పులులు త్వరలో జన్మనిస్తాయని అధికారి పేర్కొన్నారు. మగ పులి సుమారు నెలన్నర పాటు ఆడ పులితో గడుపుతున్న దృశ్యాన్ని అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో బంధించారు. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. కానీ తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెంగాల్ టైగర్లు తమ భూభాగాన్ని గుర్తిస్తాయి. ఇవి సరిహద్దులను ఏర్పాటు చేయడానికి, ఆహారం, నీరు వనరులతోపాటు సహచరులను ఆకర్షించడానికి వీలు కల్పిస్తుంటాయి. 2-ఎసిటైల్-1-పైరోలిన్ (బాసుమతి బియ్యానికి ఉండే విలక్షణమైన సువాసనను అందించే సమ్మేళనం) అనే అణువు ఉండే మూత్రాన్ని స్ప్రే చేయడం ద్వారా పులులు తమ ఉనికిని మరియు ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంలోని ఇతర పులులకు తెలియజేస్తాయి. సువాసన గుర్తుతో పాటు, పులులు తమ ప్రాదేశిక వాదాలను మరింత నొక్కి చెప్పడానికి చెట్లకు పంజా వేసి ఈ పులులు గర్జిస్తాయి. అనేక ముఖ్యమైన కారణాల వల్ల పులులు తమ భూభాగాన్ని గుర్తించుకుంటాయి. అడవిలో జీవించడంతోపాటు వృద్ధి చెందడానికి వాటికి ఇవి సహాయపడతాయి.