మూడురోజులుగా కాకినాడలో నిర్వహిస్తున్న అంతర్‌జిల్లాల స్కేటింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్-11, 14, 17, 19 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎల్.జార్జి తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశామన్నారు.
కార్యక్రమంలో డీఎస్ఏ సీఈవో బి.శ్రీనివాసకుమార్, హరీష్ చారిటబుల్ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, పరిశీలకులు ఎస్.దిలీప్‌కుమార్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.రవిరాజు, కార్యదర్శి కె.నూకరాజు, స్కేటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్, దొరైస్వామి, జి.సునీల్‌కుమార్, పరుశరామ్ పాల్గొన్నారు.