కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. డ్రోన్ సాంకేతికత, పరిశోధన, ఉత్పత్తి, శిక్షణ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం రెండురోజుల పాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహించనుంది. సమ్మిట్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా 5,500 డ్రోన్లతో ప్రత్యేక షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. సదస్సులో ప్రభుత్వం ముసాయిదా డ్రోన్ పాలసీని వెల్లడించటంతో పాటు అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది.ఈ జాతీయ సదస్సుకు ము
ఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎవ్వరయినా ఏపీకి రావాలంటే సరైన సధుపాయాలు లేవన్నారని, దాంతో తాము ఓపెన్ స్కై పాలీసీ తీసుకువచ్చామన్నారు. 5వేల ఎకరాల భూమిని అక్వైర్ చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. ఆ తరువాత ఒకదాని తరువాత మరోటి ముందుకు తీసుకువెళ్లామని, షంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో 32 సార్లు సమావేశం అయ్యామన్నారు. ఇప్పడు చెపుతన్నా.. హైదారాబాద్ ఇండియాలో చాలా బెస్ట్ సీటీ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇండియా బ్రాండ్ ను ప్రమోట్ చేశారని, డిజిటల్ కరెన్సి విషయంలో రిపోర్టు ఇవ్వాలని ప్రధాని అడిగితే ఇచ్చామని చెప్పారు. ఇప్పడు అత్యధికంగా డిజిటల్ కరెన్సి వాడుతున్న దేశం ఇండియా అని తెలిపారు.