జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా పరామర్శకు వెళ్లారా? అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై ఆయన నోరు మెదపలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక సొంత బాబాయి వైఎస్ వివేకానంద హత్య గురించి కూడా మాట్లాడలేదన్నారు. జగన్ అయిదేళ్ల పాటు నేరపూరిత ఆలోచనలతో పాలన సాగించారని విమర్శించారు.కానీ ఇప్పుడు పరామర్శల పేరుతో బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరద బాధితుల కోసం రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్ ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. అరాచకాలు చేస్తే, మహిళలపై దారుణాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.