ఎన్నికలకు ముందు మహిళా వాసిరెడ్డి పద్మతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి జగన్ రాజీనామా చేయించారు. ఆమెకు జగ్గయ్యపేట టిక్కెట్ ఖరారు చేశారని అందుకే రాజీనామా చేయించారని ప్రచారం జరిగింది. విచిత్రంగా ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు.
అయితే జగ్గయ్యపేట వైసీపీ నేత ఉదయభాను రాజీనామా చేసిన తరవాత ఇంచార్జ్ గా తనకు ఇస్తారని వాసిరెడ్డి పద్మ అనుకున్నారు. అసలు ఆమె పేరు కూడా పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.