నిత్యం తన భార్య చుక్కలు చూపిస్తోందంటూ ఓ భర్త ఫ్యామిలీ కోర్టుకు ఎక్కాడు. తన భార్య నుంచి ఎలాగైనా సరే విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే తన భార్య రోజూ తనను పెట్టే టార్చర్, వేధింపులు మొత్తం కోర్టు ముందు వివరించాడు. అతడి బాధను అర్థం చేసుకున్న ఫ్యామిలీ కోర్టు జడ్జి వారిద్దరికీ విడాకులు ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఆ తీర్పును అతడి భార్య హైకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా బాధిత భర్త చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. వారిద్దరికీ విడాకులు ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
పంజాబ్ హర్యానా హైకోర్టు ముందుకు విచారణకు వచ్చిన ఓ విడాకుల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన ఓ జంటకు 2017లో పెళ్లి అయింది. మొదట్లో వారి కాపురం బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య వచ్చిందని.. భర్త మొదట ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య పూర్తిగా మొబైల్ గేమ్స్, పోర్న్ వీడియోలకు బానిస అయిందని విడాకుల పిటిషన్‌లో భర్త పేర్కొన్నాడు. అంతేకాకుండా రాత్రిపూట శృంగారం చేయాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేసేందని తెలిపాడు. కనీసం 15 నిమిషాలపాటు.. తనతో శృంగారం చేయాలని వేధింపులకు గురి చేసేదని వివరించాడు. అంతేకాకుండా రోజూ రాత్రి 3సార్లు సెక్స్ చేయాలని బలవంతం చేసేదని వెల్లడించాడు.
అయితే అది సాధ్యపడకపోవడంతో తనను, తన కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు తిట్టేదని భర్త తెలిపాడు. తనను హిజ్రా అనేదని.. ఇలాంటి అసమర్థుడికి జన్మను ఇచ్చావని.. తన తల్లిని కూడా దూషించేదని పేర్కొన్నాడు. అయితే తనను శారీరకంగా సుఖపెట్టలేకపోతున్నానని తనను అవహేళన చేసేదని.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని బెదిరించినట్లు చెప్పాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు.. వారిద్దరికీ ఈ ఏడాది జులైలో విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ విడాకులపై ఫ్యామిలీ కోర్టు తీర్పును ఆ భార్య.. పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాల్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపి వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడం సరైందేనని తేల్చి చెప్పింది.
విడాకుల తీర్పును సమర్థిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను హిజ్రా అని పిలవడం అతడ్ని మానసికంగా హింసించడం కిందికే వస్తుందని పేర్కొంది. అయితే తన భర్త చేసిన ఆరోపణలను ఆ భార్య ఖండించింది. తాను అశ్లీల చిత్రాలను బానిస అయినట్లు ఎలాంటి ఆధారాలు చూపించలేదని పేర్కొంది. అంతేకాకుండా తనను అత్తింటి నుంచి భర్త గెంటేశాడని తెలిపింది. ఇక తనకు తన అత్తింటి వారు మత్తు మందులు ఇచ్చేవారని.. తాను స్పృహ కోల్పోయిన తర్వాత తనకు మంత్రగాళ్లు ఇచ్చే తాయత్తులు తీసుకువచ్చి తన మెడకు కట్టేవారని ఆరోపించింది. తనను వారి నియంత్రణలోకి వచ్చేలా చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
ఇరుపక్షాల వాదనలు విన్న పంజాబ్ హర్యానా హైకోర్టు.. ఆ భార్యాభర్తలకు విడాకులు ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. వారిద్దరూ గత 6 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారని.. దీంతో వారిని కలపడానికి వీలు లేకుండా వారి బంధం విడిపోయిందని పేర్కొంది. వారిద్దరి మధ్య శారీరకంగా, మానసికంగా తీవ్ర అంతరం ఏర్పడిందని తెలిపింది. అదే సమయంలో భర్త, అత్తింటివారు తనపై గృహ హింసకు పాల్పడ్డారని భార్య చేసిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.