రాష్ట్రంలో జరిగే ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసినట్టు పంచాయతీ నిధులు పక్కదారి పట్టించవద్దు అని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతపై అధికారులు నిన్న తనిఖీలు చేశారు. పనుల తనిఖీపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఇతర అధికారులతో పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.