తిరుమలలో అక్టోబరు 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని ఆ రోజున టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa