ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. పార్థిబన్ ఇవాళ సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి విచ్చేశారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్... పార్థిబన్ ను సత్కరించి, పలు జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా పవన్ కు జ్ఞాపిక అందించారు. అంతేకాదు, తన ముఖ చిత్రంతో కూడిన ఓ పుస్తకాన్ని కూడా బహూకరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa