చెకుముకి సైన్స సంబరాలు ద్వారా విద్యార్థు లు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జేవీ వీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఆదివారం జిల్లా స్థాయి చెకుముకి సంబరాలను ఆయన ప్రారంభించారు. సైంటిస్ట్ డాక్టర్ కామూర్తి రవితేజ పా ల్గొని ప్రశ్నపత్రాలు విడుదల చేశారు. 24 మండలాలకు చెందిన జట్లు సైన్స పరీక్షలు రాయగా ప్రభుత్వ పాఠశాలల నుంచి గుత్తి మోడల్ స్కూల్ ఎంపిక కాగా ప్రైవేటు పాఠశాలల నుంచి అనంతపురానికి చెం దిన లక్ష్మీ సినర్జీ హైస్కూల్ రాష్ట్రస్థాయి సైన్స సంబరాలకు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా గేయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాలు గు లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్న ఏకైక సైన్స కార్యక్రమం చెకుముకి సంబరాలని చెప్పారు.
ఈ రెండు పాఠశాలల విద్యార్థులు నవంబరు 9, 10వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స సంబరాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచె లక్ష్మీనారాయణ, అనంతపురం నగర గౌరవ అధ్యక్షుడు గంగినాయక్ , రాయదుర్గం గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ అయూఫ్, అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, జగదీష్, మాంతేష్ తదితరులు పాల్గొన్నారు.