పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్ వద్ద ఈనెల 27వ తేదీన మూడున్నర సంవత్సరాల బాలికపై లైంగిక దాడి జరిగింది. దీనిపై సమాచారం అంది న వెంటనే విజయనగరం మహిళా పీఎస్లో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి విజినిగిరి రవి(31)ని అదుపులోకి తీసుకున్నామన్నారు.
దీనిపై విజయన గరం డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్షపడే విధంగా అన్ని సాంకేతిక ఆధారాలు, సాక్షాలు సేకరించారన్నారు. మైనర్ బాలికకు అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఈ కేసును ప్రత్యేక పోక్సో కోర్టు ద్వారా వేగంగా ప్రాసిక్యూట్ చేసి నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.