పాలకొండ మండలంలోని అట్టలి గ్రామానికి చెందిన కనుముల జగన్మోహన్రావు (47) అనే రైతు ఆదివారం సాయంత్రం వరి పంటకు సాగునీరు కట్టేందుకు వెళ్లి మృత్యు ఓడిలోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే .. తోటపల్లి ఏడో బ్రాంచి ద్వారా అట్టలి తదితర గ్రామాలకు పూర్తిస్థాయిలో సా గునీరు అందడం లేదు. దీంతో చేసేది లేక జగన్మోహన్రావు ఆదివారం సాయంత్రం గెడ్డ నుంచి సాగునీటిని పంట పొలానికి మళ్లించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన గుండెపోటు వచ్చి మృతి చెంది ఉంటాడని బంధువులు పే ర్కొంటున్నారు.
రా త్రి ఏడు గంటలు అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కు టుంబ సభ్యులు పంట పొలానికి వెళ్లి చూడగా జగన్మోహన్రావు విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆయనను గ్రామంలోకి తీసుకొచ్చి సోమవారం ఉదయం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈయనకు భార్య మౌనిక, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.