ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మద్యాహ్న భోజనాన్ని పునఃప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కడవల రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మద్దికెర తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. తరుణ్, వేణు, అనిల్, ప్రకాష్ ఉన్నారు.