ఆ కోర్టులో వాదప్రతివాదనలు సీరియస్‌గా జరుగుతున్నాయి. జడ్జి, లాయర్లు మధ్య మటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. అంతే.. ఒక్కసారిగా కోర్టు వాతావరణం మారిపోయింది.కోర్టు హాలులో అధిక సంఖ్యలో లాయర్లు ఉండటంతో వారంతా జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ ముష్టియుద్ధానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఓ కేసులో బెయిల్ నిరాకరించడంతో లాయర్లు, జడ్జి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్ జిల్లా కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఓ కేసులో ఈ వివాదం చోటు చేసుకుంది. పెద్ద యెత్తున వచ్చిన లాయర్లు, జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో కోర్టు రూములోని కుర్చీలను విసురుకుంటూ నానారచ్చ చేశారు.