ఏపీలో దీపావళి కానుకగా ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన గ్యాస్ బుక్సింగ్ ప్రారంభమయ్యాయి. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు ప్రభుత్వం ముంజూరు చేసింది. ఇప్పటికే మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్లను పెట్రోలియం సంస్థలకు అందజేసింది. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని లాంభనంగా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.