గత ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పెరుగుతోందని మంత్రి అనగాని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో వీటికి బానిసలుగా మారిన వారిని మంచి దారిలో నడిపించే ప్రయత్నం తమ కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
తిరుపతి పరిసరాల్లో జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు అధికంగా ఉండటం కూడా డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీసు యంత్రాంగం ద్వారా ఆయాచోట్ల విద్యార్థులను చైతన్యపరిచేందుకు, మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హామీల అమలు గరించి వివరించారు. సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, డీఆర్వో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.