కర్నూలు నగర ప్రజలంతా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన ప్రారంభించారు. మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, క్రాకర్స్‌ను పరిశీలించారు. దుకాణదారులతో అమ్మకాల తీరును విచారించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అవినీతి నాయకుల వల్ల బాణసంచా దుకాణాలకు రూ.30వేలు ఆదాయం వస్తే రూ.40 వేలు లంచాలకే చెల్లించాల్సి వచ్చేదని అన్నారు.
బాణసంచా దుకాణదారులు మంత్రి టీజీ భరతను కలిసి తమ సమస్యలు విన్నవించడంతో వారికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తానికే షాపులు పెట్టుకునేలా ఏర్పాట్లు చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యప్రకాశ, బాణసంచా దుకాణాల అసోసియేషన నాయకులు సందీప్, కృష్ణ, లవకుమార్ పాల్గొన్నారు.