ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళ వారం ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేకువ జాము నుంచే ఆలయానికి పోటెత్తారు. పం చామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ తలయారీ రామవరపు చినపైడిరాజు, పూజారి బంటుపల్లి వెంకటరావులు పైడిమాం బను ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవ సందర్భంగా నగ రంలో విచిత్ర వేషధారణలతో పండగ వా తావరణం నెలకొంది. పైడిమాంబ దీక్షాదారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిమాంబ ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులంతా బుధవారం చండీ హోమం నిర్వహించనున్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో వారు దీక్ష విరమించనున్నారు.