కేసీఆర్ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరిగిందని.. ఇదంతా కేసీఆర్ వల్లే జరిగిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.
గతంలో కరీంనగర్లో రూ.10 లక్షలకు ఎకరం వచ్చేదని.. ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ. 80 లక్షలు పలుకుతుందన్నారు. అలాగే రేవంత్ రెడ్డి 10 నెలల పాలన కూడా బాగుందని టీడీపీ ఎమ్మెల్యే కితాబిచ్చారు.