పండుగ సీజన్‌తో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ (అన్ రిజర్వుడ్) రైళ్లను నడుపుతున్నారు. నవంబర్ 1 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, విజయవాడ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa