ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ జంప్.. సీఆర్పీఎఫ్ భర్త సడెన్ ఎంట్రీ, రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే?

national |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2024, 09:32 PM

భర్త ఉండగానే భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడం.. భార్య ఉండగానే భర్త మరో మహిళతో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్న ఘటనలను మనం నిత్యం చేస్తూనే ఉన్నాం. పెళ్లి అయిందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా భాగస్వామిని వదిలేసి మరొకరితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా వివాహం చేసుకున్న వారిని వదిలి వారితోనే వెళ్లిపోతున్న వాళ్లను చూస్తూనే ఉన్నాం. కొన్ని ఘటనల్లో అందం చూసి.. మరికొన్ని ఘటనల్లో ఆస్తులను చూసి.. ఇతరుల భాగస్వాములతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని షాక్‌కు గురి చేసింది. బీహార్ పోలీస్ శాఖలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్.. తన సీఆర్పీఎఫ్ భర్తను కాదని ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఆమె భర్త ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.


ప్రియుడితో కలిసి బుధవారం పాట్నా రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆ మహిళా కానిస్టేబుల్‌.. లింక్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్రౌలీకి పారిపోయేందుకు వచ్చింది. అయితే తన భార్య మరో వ్యక్తితో పారిపోతోందని.. ఆమె భర్తకు సమాచారం అందింది. వెంటనే హుటాహుటిన పాట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య వేరే వ్యక్తితో పారిపోతుండగా.. వారిద్దర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో ఆ సీఆర్పీఎఫ్ భర్త.. తన భార్య, ప్రియుడిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన భార్య ప్రియుడిపై భర్త దాడికి దిగాడు. ఈ ఘటనను ఆ పాట్నా రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


ఇక తన భర్త నుంచి ప్రియుడిని కాపాడేందుకు ఆ మహిళా కానిస్టేబుల్ విశ్వ ప్రయత్నం చేసింది. అయినా వదిలిపెట్టని ఆ భర్త మాత్రం వదిలిపెట్టలేదు. భార్య ముందే ఆమె ప్రియుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. చుట్టూ రద్దీగా ప్రయాణికులు ఉండగానే అతడిపై దాడి చేశాడు. స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా ఆ మహిళ భర్త ఆగకుండా.. తన భార్య ప్రియుడిని కొడుతూనే ఉన్నాడు. అతని దెబ్బలు తాళలేకపోయిన ఆ ప్రియుడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ సీఆర్పీఎఫ్ భర్త.. తన భార్యను వెంటపెట్టుకుని తీసుకునే వెళ్లే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం వెళ్లలేదు. తన భర్త నుంచి విడిపించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com