ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2024, 03:02 PM

అలర్ట్.. మరో అల్పపీడనం రాబోతోంది.. మళ్లీ వర్షాలు ఫుల్లుగా కురుస్తాయ్.. అంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్‌ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని IMD ప్రకటించింది.. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది..తాజాగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో.. తీర ప్రాంతాల అధికారులు అలర్టయ్యారు.


 


తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..


ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వర్ష సూచన చేసింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ క్రమంలో ఏపీ వాతావరణ విభాగం కూడా కీలక ప్రకటన చేసింది.. ఆదివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com