త్వరలోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీయే విజయం సాధిస్తుందని తెలిపారు.ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. శాంతి, భద్రతలు కుంటుపడినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రభుత్వం ప్రజలను అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటోందని ఆరోపించారు.