అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ ఆధునికీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని.. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సోమవారం కోరారు.
కర్నూల్ పట్టణంలో ఆయనను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. హంద్రీనీవా కాలువ తగిన సామర్థ్యం లేక చాలా మంది రైతులకు సాగు నీరు అందలేదని తెలిపారు.