వైసీపీ ఎంపీ విజయసాయి టీడీపీ, సీఎం చంద్రబాబుపై ట్విట్టర్(ఎక్స్)లో చేసిన పోస్ట్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యoగ్యాస్త్రాలు సందించారు. తాను కేంద్ర మంత్రి అయితే, కార్మికులను, కూలీలను లాభాల్లో భాగస్వామ్యులను చేస్తానంటూ చెప్పారు.
ఎంపీ అయితేనే విజయసాయి, అతని వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏం మిగిలేది కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.అయినా ఇంకా కూడా వైసీపీ బతికి బట్ట కడుతుందని ఆశ ఉందా అని ప్రశ్నించారు. మొన్న జగన్ రెడ్డి కన్నతల్లే ఆయన బతుకు బయటపెట్టిన తర్వాత ఇంకా వైసీపీ ఎక్కడుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.