పాతపట్నం పరిధిలోని కాగువాడలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల నిర్వహణ ఇతర సదుపాయాలపై విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాల అంతా కలియతిరిగారు. వంటగదిని పరిశీ లించి తయారు చేసిన వంట పదార్థాలను రుచి చూశారు. కూర ఉడకక పోవడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఉడకని బెండకాయల కూరా పిల్లలకు పెడతారా, ఇది న్యాయమా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు.
వంట సిబ్బం దిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా వారు 4.30 గంటలకే వంట ముగించుకుని వెళ్లిపోయారని ప్రిన్సిపాల్ తెలపడంతో అసహనానికి గురయ్యారు. రికార్డులను పరిశీలించారు. పిల్లలకు భోజనం పెట్టేవరకు సిబ్బంది ఉండరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గురుకులాల సంస్థ కార్య దర్శి ఎ.కృష్ణమోహన్‌తో ఫోన్‌లో మాట్లాడి గురుకులంలో లోపాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యదర్శి కృష్ణ మోహన్ స్పందిస్తూ.. హెడ్‌కుక్ ఎల్.ఇందిర, హెల్పర్ వై. సావిత్రిలను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీరాములు తెలిపారు.