మోదుగవలసజంక్షన్ సమీపంలోని దమయంతి మోడరన్ రైస్ మిల్లులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హిరమండలం మండలం సుభలయి గ్రామానికి చెందిన సాహు కారు వెంకటరమణ (28) దమయంతి రైస్ మిల్లుకు సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు గాను అవసరమైన కొలతలు తీసేందుకు మరో ముగ్గురు టెక్నీ షియన్లతో కలిసి మిల్లు పైకి వెళ్లాడు. కొలతలు తీస్తుండగా వెంకటరమణ నిలుచున్న రేకు విరిగిపోయి కిందకు జారిపడి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఎల్ఎన్పేట మండలం చింతలబడవంజకి చెందిన పోలినాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి తండ్రి ప్రసాద్, తల్లి మాణిక్యం, చెల్లెలు ఉన్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న సరుబు జ్జిలి ఇన్చార్జి ఎస్ఐ టి. రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.వెంకటరమణ మృతితో ఆయన స్వగ్రామం హిరమండలం మండలం సుభలయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. పేద కుటుంబం కావడం, తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక్కగా నొక్క కొడుకు మృతి చెందడంతో వారు బోరున విల పిస్తుండడంతో గ్రామస్థులు వేదనకు గురయ్యారు. వెంకటరమణ అందరితోనూ కలివిడిగా ఉండే వాడని, అకాల మరణం చెందడంతో గ్రామస్థులు విచారం వ్యక్తంచేస్తున్నారు.