ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం ప్రాంతాన్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 02:22 PM

అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. పలువురు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 31 మండలాలు కరువుతో అల్లాడుతున్నాయని, ఏడు మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించడం అన్యాయమని అన్నారు.


తక్షణమే మిగిలిన మండలాలను కూడా కరువు కింద ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు, గుత్తి, యాడికి ,ఉరవకొండ, కణేకల్లు, బొమ్మనహాళ్‌ ,తాడిపత్రిలలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. కళ్యాణదుర్గంలో ఆర్డీఓకు అందించారు. పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల గ్రామసచివాలయం వద్ద నిరసన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com