గ్రామరెవెన్యూ సహాయకులకు రాత్రి పూట నైట్ వాచ్మన్ డ్యూటీలు ఇసుక రీచ్ వద్ద చేయాలని జారీచేసిన ఉత్తర్వులు ఉసంహరించుకోవాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం నాయకులు సూర్యనారాయణ కోరారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలోని సంఘ నాయకులు గురుమూర్తి, వెంకన్న పాల్గొన్నారు.