బొబ్బిలిలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని పారిశుధ్య మహిళా కార్మికులు కోరారు. సోమవారం స్ధానిక పాకీ వీధిలోని పారిశుధ్య కార్మికుల కాలనీ ప్రాంతంలో మురుగునీటి శుద్ధిప్లాంట్ నిర్మించవద్దని కార్మికులు మునిసి పల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకు డు పి.శంకరరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం మునిసిపల్ కమిషనరు లాలం రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
కాగా రెవెన్యూ శాఖ అధికారులు అక్కడ ప్రభుత్వ భూమిని మురుగునీటి శుద్ధి ప్లాంట్ కోసం కేటాయించారని కమిషనరు లాలం రామలక్ష్మి తెలిపారు. స్థానికుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులతో చర్చించారని చెప్పారు. కొంత స్థలాన్ని కార్మికుల కోసం గ్రూపుహౌస్‌లను నిర్మించాలని, మిగిలిన స్థలాన్ని ప్లాంట్ ఏర్పాటుకు కేటాలయించాలని ఆదేశించారని తెలిపారు. మునిసిపాలిటీకి పారిశుధ్య కార్మికుల సంక్షేమం కూడా అవసరంకావడంతో ఆ ఇళ్ల నిర్మాణానికి సత్వరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.