వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాపై వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఉండాలని వైయస్ఆర్‌సీపీ తీర్మానించింది. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవైపు సమావేశాలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యేలతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.
సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓటు షేరింగ్ ఉన్న వైయస్ఆర్ సీపీని లేఖ రాసినప్పటికీ స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైయస్ఆర్ సీపీ. ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైయస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఎమ్మెల్యేలతో వైయస్ జగన్ చర్చిస్తున్నారు.