రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర తీశారని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో పాలన చేతకాక చంద్రబాబు చేతులెత్తేశాడని కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు.
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. రాజకీయ హత్యలు.రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చేస్తున్నది 'ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్'(వ్యవస్థీకృత నేరం).ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. 40ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు.. పాలన చేతకాక చేతులెత్తేశాడు అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.