కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. మహిళలపై దాడులు ఆగడం లేదని... ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని వ్యాఖ్యలు చేశారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదని... ఐదు నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందన్నారు.