కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. పాలకొల్లు పంచారామ క్షేత్రంలో వేకువజామునే మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హర హర మహాదేవ అంటూ దీపోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నరసాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్థానాలు ఆచరించి.. కార్తీక దీపాలు విడిచి పెట్టి పూజలు చేస్తున్నారు.