రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో పురాతన శివలింగం ఉంది. సోమశిల నుంచి 7 కిలోమీటర్లలో దట్టమైన కొండలలో పంచలింగాలకోనలో వెలసి ఉన్న శివుడిని కార్తీక మాసం సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు. ఇక్కడున్న జలపాతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక మాసం, పండులలో మాత్రమే కాకుండా వర్షాలు పడిన ప్రతిసారి ఇక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.