భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు ఆలయాలు అని అవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ అద్వైతానంద భారతి అన్నారు. అనంతపురం , శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, పాతూరులోని దత్తమందిరాలను మంగళవారం ఆయన సందర్శించారు.
భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. దురహంకారమనే సముద్రంలో కొట్టుకుపోతున్న జీవులను కాపాడేందుకు భగవంతుడు వేదం అనే నావను సృష్టించారని అన్నారు. మనలోని శ్రద్ధ, భక్తిప్రపత్తులకు మూలకేంద్రాలు ఆలయాలని, తోటివారందరినీ కలుపుకుని కులమతాలు, రాజకీయాలకు అతీతంగా దేవాలయ వ్యవస్థను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాశీవిశ్వేశ్వ రాల యం ఈఓ సాకే రమేష్‌బాబు, అనువంశీకుడు హో సూ రు రామసుబ్రహ్మణ్యం, శంకరమఠం కార్యనిర్వహ ణాధి కారి సత్యప్రసాద్, అప్పా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.