బుధవారం మధ్యాహ్నం గంటపాటు కురిసిన భారీ వర్షంతో చీరాల పట్టణం చెరువుగా మారిపోయింది. చర్చి రోడ్, మున్సిపల్ హై స్కూల్ రోడ్, దర్బార్ రోడ్ తదితర ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నీరు సైలెన్సర్ లలోకి వెళ్లిపోవడంతో కొన్ని వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. అలాగే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పేరాలలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో కొత్తది అమర్చాల్సి వచ్చింది.