చంద్రగిరి మండల నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట సోమవారం ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తిరుపతి నుంచి యశోద అనే మహిళ సీఎంను కలిసేందుకు రాగా అనుమతి లభించలేదు. దీంతో ఆమె బలవంతంగా లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె చేతి గాజులు పగులగొట్టుకుని వాటిని మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను నిలువరించి పోలీసు స్టేషన్ కు తరలించి అనంతరం విడిచిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa