ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చేలా.. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో సమావేశమవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో 85 వేలకోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మంగళవారం ఏపీ సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. మొత్తం 10 పరిశ్రమలు రూ.85 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అనుమతించారు. ఈ పెట్టుబడుల ద్వారా 34 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నక్కపల్లిలో రూ.61,780 కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 21 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1430 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5001 కోట్ల పెట్టుబడితో 1,495 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
పరిశ్రమలు పెట్టుబడి ఉద్యోగాల సంఖ్య
ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ ఇండియా రూ.61,780 కోట్లు 21000
ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ రూ.8,240 కోట్లు 4000
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5001 కోట్లు 1,495
కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1430 కోట్లు 565
గ్రీన్ సోలార్ ఐఆర్‌ఈపీ లిమిటెడ్ రూ.2000 కోట్లు 1725
ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.1662 కోట్లు 350
ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్లు 2,381
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ.798 కోట్లు 200
టాఫే పరేషియా ఇండియా లిమిటెడ్ రూ.76 కోట్లు 250
డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్‌ఎల్‌పీ రూ.50 కోట్లు 2000
మరోవైపు రూ.85 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన విషయమై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైందన్న నారా లోకేష్.. ఐదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబు రాకతో మిట్టల్, రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ, టిసిఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే సమయం దగ్గర్లోనే ఉందంటూ లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa