ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుచేయలేదు కాబట్టే ధైర్యంగా నిలబడ్డాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 04:07 PM

గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా.. బలంగా నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఆనాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని..ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com