ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటంది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అలెక్స్ కారీ (19), మిచెల్ స్టార్క్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. తక్కువ స్కోరుకే ఆలౌటైన టీమిండియా.. బౌలింగ్‌లో మాత్రం చెలరేగారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించారు. కెప్టెన్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులోకి రాగానే.. దూకుడు బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపించారు. బుమ్రాకు తోడు సిరాజ్ కూడా తోడయ్యాడు. అతను కూడా 2 వికెట్లు తీశాడు. మరోవైపు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హర్షిత్ అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. తాను కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్కోరు వద్ద మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 19 పరుగుల వద్ద ఖవాజాను బుమ్రా ఔట్ చేశాడు. తర్వాతి బంతికి స్టీవ్ స్మిత్ కూడా ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా 31 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్నస్ లాబుషాగ్నేను కూడా సిరాజ్ పెవిలియన్ కు పంపించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను బుమ్రా క్యాచ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 83 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.