బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారని..అందులో జగన్ పేరు ఉందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అడానికి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు రూ.1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని జసీఎం చంద్రబాబును కోరారు. ఇది ప్రజా సొమ్ము కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏమి చేయకపోయినా ఆయనను దీనిపై 53 రోజులు జైలో పెట్టారని చెప్పారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై అందరం బాధపడ్డామన్నారు. జాతీయ, ప్రాంతీయ మీడియా దీనిపై ఘోషిస్తుందని చెప్పారు.జగన్ ఎవడబ్బ సొమ్ముని రుషికొండపై ప్యాలెస్ నిర్మించారని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.దీనిపై నిజానిజాలు తేల్చాల్సి అవసరం ఉందన్నారు. రాష్ట్ర పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్న మనం చేతులు ముడుచుకొంటే ఎలా అని ప్రశ్నించారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.