చలికాలంలో కాసిన్ని పల్లీలను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. వీటితో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలకుండా నిరోధించవచ్చు. పల్లీలలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వీటితో మన శరీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుంది. దీంతో మనం ఉత్సాహంగా ఉంటాం. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.