భారత్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పెర్త్ టెస్టు లో మూడో రోజు అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన అతను..రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడో రోజు కేఎల్ రాహుల్ తన 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైశ్వాల్ భారీ ఇన్నింగ్ ఆడి 295 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లుతో 161 పరుగుల సునామీ కురిపించాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిచెల్ మార్ష బౌలింగ్‌లో స్మీత్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ ఆయిన భారత్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 104 వద్ద కట్టడి చేసింది. 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 3 వికెట్ల నష్టానికి 320 భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. టీమ్ ఇండియా 401 పరుగులతో ఆధిక్యంలో ఉన్నది.